పల్లాను గెలిపించండి: ఖమ్మంలో పువ్వాడ

167
puvvada ajay
- Advertisement -

తొలి ప్రాధాన్యత ఓటుతోనే టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు మంత్రి పువ్వాడ అజయ్‌. పల్లా విజయాన్ని కాంక్షిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్, గ్రానైట్ యజమాన్యాలతో ఖమ్మంలో సమావేశం నిర్వహించారు పువ్వాడ.

ఈ సందర్భంగా మాట్లాడిన పువ్వాడ…టీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామిక రంగాలకు అనేక సబ్సిడీలు అందించి ఆయా రంగాలను బలోపేతం చేసిందన్నారు. అందుకే రెండు, మూడో ప్రాధాన్యతతో పనిలేకుండా మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు సంధించే ప్రతి ప్రశ్నకు పల్లా గెలుపు ద్వారా సమాధానం లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు స్ధానికులు పాల్గొన్నారు.

- Advertisement -