దళితబంధు…సీఎం కేసీఆర్‌కు పువ్వాడ కృతజ్ఞతలు

104
puvvada

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న దళితబందు పథకాన్ని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో దళితబందును అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి పువ్వాడ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్ తో పాటు దళితబంధు ను అమలు చేయాలని సంకల్పించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి ఖమ్మం జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో పాటు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను సిఎం కెసిఆర్ గారు ఎంపిక చేశారని వెల్లడించారు.
దళితుల అభ్యున్నతికి కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.