కేటీఆర్ @ 30 లక్షలు

40
ktr

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు మంత్రి కేటీఆర్. ఓ వైపు ప్రభుత్వ పాలనలో బిజీగా ఉన్న తనదృష్టికి వచ్చి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో ఒకరు కేటీఆర్. ఈ నేపథ్యంలోనే ఎల్ల‌ప్పుడూ ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌.. 30 ల‌క్ష‌ల మార్క్‌ను చేరుకున్నారు. దీంతో కేటీఆర్ ఫాలోవ‌ర్స్ సంఖ్య ఇప్పుడు 30 ల‌క్ష‌ల‌కు చేరింది.

ఏడాది కాలంలోనే కేటీఆర్ 10 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వ పాల‌న‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస్క్ కేటీఆర్ అనే ప్రోగ్రామ్ ను నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చెబుతూ.. ప్ర‌తి అంశానికి త‌న‌దైన శైలిలో నెటిజ‌న్ల‌కు స‌మాధానం ఇస్తుంటారు. కరోనా సమయంలో అలాగే ఫస్ట్ లాక్‌డడౌన్‌లో తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనేకమందికి సాయం చేశారు.