ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్ధాయిలో పర్యటించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అధికారులతో కలిసి సైకిల్‌పై పర్యటించిన పువ్వాడ…తన దృష్టికి వచ్చిన సమస్యలను అడి గి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు.
నగరంలోని అన్ని ప్రధాన రహదారులు విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, రోడ్డుకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా చెత్త, తాగునీటి సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చెత్తను నిత్యం తొలగించాలని, ప్రతి రోజు డివిజన్లలో పారిశుధ్యంపై వాకబు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.
ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తామని ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు.మంత్రి పువ్వాడ వెంట మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కార్పొరేషన్ కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు ఉన్నారు.