మాది పని చేసే ప్రభుత్వం- మంత్రి పువ్వాడ

235
minister puvvada

ఉమ్మడి రాష్ట్రంలో రెండు కార్పోరేట్ సంస్థల చేతిలో ప్రైవేటు విద్యా నలిగిపోయిందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సభలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థల మనుగడ కేసీఆర్ ఆలోచన. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ, ప్రైవేట్ సంస్థలు కూడా బతకాలనేది మా ప్రభుత్వ విధానం అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు కేసీఆర్ ప్రభుత్వం సహకరిస్తూనే వచ్చింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ కూడా చేయించామని మంత్రి తెలిపారు.

ఓటరు నమోదు ప్రక్రియలో ప్రైవేటు విద్యా సంస్థలు ముందుండాలన్నారు మంత్రి. పెద్ద ఎత్తున ఓట్లు నమోదు చేయించాలి, ఓటు విలువ గురించి తెలియజెప్పాలి. మాది పని చేసే ప్రభుత్వం.. ఓటు అడిగే హక్కు మాకే ఉన్నదని మంత్రి స్పష్టం చేశారు. ఇది విజ్ఞులు వేసే ఓటు.. ఆలోచించి వేయాలి.. ఇంత పెద్ద ఎత్తున పని చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం బలపర్చిన అభ్యర్థిని గెలించాలి.మొదటి ప్రాధాన్యత ఓటుతోనే టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించాలని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.