ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపించాలి: పల్లా

121
MLC Palla Rajeshwar Reddy

రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరర్ రెడ్జి, ఖమ్మం జిల్లాలో ఎన్నికల పర్యటనలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ కాలేజీలకు కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా సహకరించింది. విద్యా సంస్థల బస్సులకు ట్యాక్స్ మినహాయింపు, విద్యుత్ బిల్లుల్లో రాయితీపై మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మిగిలిన బకాయిలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో చెల్లిస్తం అని హామీ ఇచ్చారు.ప్రైవేటు యాజమాన్యాల సమస్య పై ప్రభుత్వం పాజిటివ్ దృష్టితో ఉన్నది అన్నారు.

మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులను, అధ్యాపకులను రెగ్యూలరైజ్ చేయాలని ప్రయత్నిస్తే కొందరు కోర్టుకెక్కి అడ్డుకున్నారు. ఉద్యోగ నియామకాలు చేయలేదని ఈ ప్రభుత్వంపై కొందరు దుష్ప్రప్రచారం చేస్తున్నారు. 1.50 వేల ఉద్యోగాలను ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పల్లా స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం తగదు. కరోనా వల్ల కాస్త ఇబ్బందులు వస్తున్నాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఖమ్మం- నల్లగొండ- వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. ఓటు నమోదు విషయంలో ప్రైవేట్ కాలేజీలు కీలక భూమిక పోషించాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరర్ రెడ్జి తెలిపారు.