ప్రజలకు అండగా ప్రభుత్వం…అధైర్య పడొద్దు: మంత్రి పువ్వాడ

257
puvvada ahay
- Advertisement -

కరోనా నేపథ్యంలో ప్రజలకు అండగా ప్రభుత్వం ఉందని…ప్రజలు అధైర్య పడొద్దన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మంలో మాట్లాడిన ఆయన..కోవిడ్ వ్యాధి విస్తరిస్తుంది. నివారణ కోసం ట్రూనాట్ మిషన్ ప్రారంభించాం అన్నారు.

శాంపిల్స్ వరంగల్ పంపించేవాళ్లం…ఈ రోజు నుండి ట్రూనాట్ , ఆర్టీపీసిఎల్ , ర్యాపిడి యాంటిజెన్ సరఫరా చేశాం అన్నారు.ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు, ఏరియా ఆసుపత్రులకు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ పంపించాం అన్నారు.

రాబోయే కాలంలో 350 క్రిటికల్ కేర్ ట్రీట్ మెంట్ కు అవకాశం ఉంది.ఇప్పుడు మరింతగా వైద్యులు కష్టపడాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నాం…ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ ట్రిట్ మెంట్ చేస్తాం అన్నారు.

ఖమ్మం పేషంట్స్ హైదరాబాద్ వెళ్లకుండా ఖమ్మంలో ఆరోగ్య వంతుల్ని చేయాలన్నారు. కరోనాపై అపోహాలు, ప్రచారాలు కాదు నిబ్బరం,ఆత్మ స్థైర్యం కావాలన్నారు.

- Advertisement -