ఏపీ 3 రాజధానులకు లైన్ క్లియర్‌..గవర్నర్ అమోదముద్ర

126
ap cm jagan

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనకు గవర్రన్ బిశ్వభూషణ్ హరిచంద్ అమోదం తెలుపుతూ..సీఆర్డీఏ చట్టం- 2014 రద్దుకు అమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ఇకపై శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు అధికారికంగా కొనసాగనుంది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారు సీఎం జగన్‌. జనవరి 20న రెండు బిల్లులను ఏపీ అసెంబ్లీలో ఆమోదించగా, శాసనమండలిలో వాయిదా పడ్డాయి. ఈ తరుణంలో ఇటీవలే మరోసారి అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ వద్దకు పంపగా సుదీర్ఘంగా న్యాయ నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుని ఇవాళ ఆమోదముద్రవేశారు గవర్నర్ బిశ్వభూషణ్‌.