అర్హులైన వారందరు వ్యాక్సిన్ వేసుకోవాలి- మంత్రి గంగుల

18
gangula

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కరోనా వ్యాప్తిని పెంచే అవకాశం ఉన్న స్ట్రీట్ వెండర్స్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చి, వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కరీంనగర్ లోని దాదాపుగా 15000 స్ట్రీట్ వెండర్స్ కు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ ఈరోజు పరిశీలించారు. కరోన రహిత కరీంనగర్ ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది, వ్యాక్సిన్ 100% సురక్షితం, అర్హులైన వారందరు వ్యాక్సిన్ వేసుకోవాలని మంత్రి కోరారు.