యాదాద్రిలో ప్రపంచ స్థాయి ఏర్పాట్లు – ప్రశాంత్ రెడ్డి

150
vemula
- Advertisement -

ప్రపంచ స్థాయిలో యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్య క్షేత్రాన్ని భక్తులు సందర్శించడానికి కావలసిన వసతులను నిర్మించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆవరణలో నిర్మించబోయే బస్ డిపో మరియు బస్టాండ్ లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ….యాదగిరిగుట్ట లో నూతనంగా నిర్మించిన ప్రధాన ఆలయ పనులు పూర్తి అవుతున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆలయ ఆవరణలో నిర్మించబోయే కళ్యాణకట్ట, అన్నదాన సత్రం మొదలగు ఆధ్యాత్మిక ప్రదేశాలకు భక్తులను చేరవేసేందుకు అనువైన ప్రదేశాలలో బస్టాండ్ మరియు బస్ డిపో లను ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలించామన్నారు. Busటెర్మినల్ మరియు టెంపుల్ టర్మినల్ ప్రత్యేకంగా వేర్వేరుగా నిర్వహిస్తామన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా
బస్ స్టాండ్ లు మరియు బస్ డిపోల నిర్మాణం
చేస్తున్నామన్నారు.

యాదగిరిగుట్ట ఆవరణలో స్థానికంగా గండి చెరువు వద్ద నిర్మించిన బస్ స్టాప్ ను మరియు సైదాపూర్ లో నిర్మించిన బస్ డిపో లను పరిశీలించారు. భక్తులకు కాటేజీలు మరియు వస్తువులను భద్రపరచడానికి cloak లను ఏర్పాటు చేస్తామన్నారు. యాదగిరిగుట్ట కి రింగ్ రోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్లు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో టెంపుల్ సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రముఖులు సందర్శించడానికి ప్రెసిడెన్షియల్ షూట్ , మరియు kalyanakatta పుష్కర్ ఘాట్, టెంపుల్ కి లోపలికి మరియు బయటకు వెళ్ళడానికి కావలసిన ప్రముఖ ద్వారాలను ఏర్పాటు చేయనున్నామని, గుడి పైకి వెళ్లడానికి ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నామని, బస్ టెర్మినల్ లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట సందర్శించడానికి లక్షలాది మంది భక్తులకు 50 సంవత్సరాలకు సరిపోను ఆధునాతన వసతులను కల్పిస్తున్నామన్నారు.భక్తులు యాదగిరిగుట్ట లోని వివిధ ప్రదేశాలను ప్రయాణించడానికి అనువుగా బస్సు సౌకర్యం సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ట్రాన్స్పోర్ట్ శాఖ ఆధ్వర్యంలో బస్ టెర్మినల్ మరియు టెంపుల్ టర్మినల్ ఏర్పాటుకు కావలసిన ల్యాండ్ ను పరిశీలిస్తామన్నారు. బస్ డిపో నందు 150 బస్సులు night haltచేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వై టి డి ఎ ఆధ్వర్యంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ పూర్తిస్థాయిలో రూపొందిస్తామన్నారు.

ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ యాదగిరిగుట్ట టెంపుల్ టూరిస్ట్ హబ్గా రూపొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. యాదగిరిగుట్ట నిర్వహించనున్న వివిధ సౌకర్యాల ద్వారా స్థానికంగా ఉపాధి లభిస్తుందన్నారు.భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ యాదగిరిగుట్ట ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చే విధంగా వివిధ ఆధునిక హంగులతో నిర్మాణాన్ని చేపడతామన్నారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, జిల్లా పరిషత్ చైర్మన్ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, ఆలయ ఈవో గీత, మున్సిపల్ చైర్మన్ సుధా మహేందర్, రీజినల్ మేనేజర్ నల్గొండ వెంకన్న, ఆర్ అండ్ బి S E వసంత నాయక్, EDరెవిన్యూ పురుషోత్తం, ఈడీ కరీంనగర్ హైదరాబాద్ మునిశేఖర్,MD సునీల్ శర్మ, Suryapaeta డివిజనల్ మేనేజర్ కేశవులు, డిపో మేనేజర్ రఘు, ఆర్డీవో భూపాల్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -