అత్యాధునిక టెక్సాలజీతో జవహర్‌నగర్‌ విద్యుత్‌ప్లాంట్: కేటీఆర్

156
ktr
- Advertisement -

హైదరాబాద్ జవహర్ నగర్ విద్యుత్ ప్లాంట్‌ను అత్యాధునిక టెక్నాల‌జీతో నిర్మించిన‌ట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. మ్మాయిగూడ ప్ర‌జ‌ల‌కు శాశ్వ‌తంగా విముక్తి కల్పించేందుకు వేస్ట్ టూ ఎన‌ర్జీ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అనుమ‌తి ఇచ్చారని చెప్పారు.

జీహెచ్‌ఎంసీ, రాంకీ ఎన్విరో ఇంజినీర్స్‌ సంయుక్తాధ్వర్యంలో మున్సిపల్‌ వ్యర్థాలతో విద్యుత్‌(వేస్ట్‌ టూ ఎనర్జీ)ను ఉత్పత్తిచేసే ప్లాంటును నిర్మించారు. 19.8మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటును మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్….జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్‌, ద‌మ్మాయిగూడ ప్ర‌జ‌ల‌కు దుర్గంధం నుంచి శాశ్వ‌త విముక్తి క‌ల్పించేందుకు వేస్ట్ టూ ఎన‌ర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే వ్యర్థాలతో విద్యుత్‌ ఉత్పత్తిచేసే మొదటి ప్లాంటు ఇది కావడం విశేషం.

1200 ట‌న్నుల చెత్త‌ను విద్యుత్ ఉత్ప‌త్తికి ఉప‌యోగిస్తున్నాం. జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో గుట్ట‌లుగా పేరుకుపోయిన చెత్త‌ను రూ. 147 కోట్ల‌తో క్యాపింగ్ చేసి సుంద‌రంగా తీర్చిదిద్దుతున్నాం. స్థానిక ప్ర‌జ‌ల‌కు ఎలాంటి దుర్గంధం, మురికి వాస‌న లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -