రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆస్తులపై నాంపల్లిలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సమీక్షలో మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ ఆస్తులపై సవివరమైన నివేదిక వారం లోపల సమర్పించాలి…భూములు, ప్లాట్లు,బిల్డింగ్స్,ఆఫీస్ స్థలాలు, కమర్షియల్ స్థలాలు తదితర వాటిని కాలనీల వారిగా విభజించి వివరణ అందజేయాలి.వాటిని అనుభవిస్తున్నవారు,వాటి విస్తీర్ణం,వాటి విలువ,వాటి ప్రస్తుత పరిస్థితి పై పూర్తి ఇన్వెంటరీ (జాబితా) తయారు చేయాలి. వీటిలో నిరర్ధకమైన ఆస్తులు ఎన్ని,ఉపయోగించబడుతున్న ఆస్తులు ఎన్ని వివరంగా తెలపాలన్నారు.
ఆస్తులపై ఏమైనా కోర్టు కేసులు ఉంటే కోర్టుల్లో త్వరితగతిన కేసులు తేల్చేలా హౌసింగ్ బోర్డ్ ప్రణాళిక సిద్ధం చేయాలి….హౌసింగ్ బోర్డ్ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం,ఆస్తుల మెంటనెన్స్ కి అవుతున్న ఖర్చు వివరాలు అందజేయాలి.హౌసింగ్ బోర్డ్ ఆస్తుల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచే విధంగా స్పష్టమైన ప్రణాళిక తయారుచేయాలన్నారు.
ప్రతి వారం మీటింగ్ ఏర్పాటు చేసి హౌసింగ్ బోర్డ్ లోని అంశాల వారిగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించేలా పూర్తి సంచారం తో జాబితా సిద్ధం చేయాలి.
ఈ పూర్తి వివరాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తాం.నిరర్ధక ఆస్తులపై ఈ నివేదిక ప్రకారం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ,గృహ నిర్మాణ శాఖ,సీ.ఈ హౌసింగ్ శ్రీనివాస్,అరుణ కుమారి సెక్రటరీ,వెంకటేశ్వర్లు ఎల్.ఏ.ఓ,విమల ఎస్టేట్ ఆఫీసర్,ఈఈ లు రమణారెడ్డి,సత్యనారాయణ,కృపానంద,ధనంజయ,రఘునాథ్ జి.ఎం.ఎఫ్ ,పద్మ ఏ.ఈ.ఓ అడ్మిన్,ప్రణయ్ సూపరింటెండెంట్ తదితర హౌసింగ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.