కాళేశ్వర దేవస్ధానం ఛైర్మన్‌గా గంట రాంనారాయణగౌడ్‌..

58
kaleshwaram temple

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా గంట రాంనారాయణగౌడ్‌ను ఎన్నికయ్యారు.ఈ మేరకు సమావేశమైన ఆలయ ధర్మకర్తలు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాంనారాయణగౌడ్‌…ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాననన్నారు. గత చైర్మన్‌ బొమ్మర వెంకటేశం అనారోగ్యంతో మృతి చెందగా దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు మరో చైర్మన్‌ను ఎన్నుకున్నారు.

వచ్చేనెల 23న కమిటీ కాల పరిమితి ముగియనుంది. కార్యక్రమంలో ధర్మకర్తలు ఓగేశ్‌, సంజీవరెడ్డి, శ్రీహరి, సత్యనారాయణ, కృష్ణ్ణారెడ్డి, రాంసింగ్‌, దేదేందర్‌రెడ్డి, రమేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భవాని, ఎంపీటీసీ మమత, సర్పంచ్‌ వెన్నపురెడ్డి వసంత పాల్గొన్నారు.