కాళేశ్వరంతో మారిన తెలంగాణ ముఖచిత్రం:ప్రశాంత్ రెడ్డి

288
prashanth reddy
- Advertisement -

కాళేశ్వరంతో తెలంగాణ ముఖ చిత్రం మారిందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సూర్యపేట జిల్లా మట్టంపల్లి మండలం మట్టపల్లి గ్రామం వద్ద ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకల కోసం కృష్ణా నదిపై నిర్మించిన హై లెవల్ బ్రిడ్జి ని మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ప్రశాంత్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి… ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది చెందిందన్నారు.పేదలు ,రైతులు నేడు ఆత్మగౌరవం తో జీవిస్తున్నారు..కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ ముఖ చిత్రం పూర్తిగా మారిందన్నారు.

ఉద్యమ సమయంలో తెలంగాణ మారు మూల పల్లెలను కలియ తిరిగిన నాయకుడు కేసీఆర్ అన్నారు.సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ ఫలాలతో సగటు మనిషి సంవత్సర తలసరి ఆదాయం 2 లక్షల 28 వేల రూపాయలకు పెరిగిందన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్‌ 1గా విరాజిల్లుతోందని… మంత్రి జగదీష్ రెడ్డి నిరంతర శ్రామికుడు… అనుక్షణం అభివృద్ధి కోసమే పరితపిస్తారని చెప్పారు.

- Advertisement -