మొక్కలు నాటిన నటుడు జయప్రకాష్‌..

52
jayaprakash

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు శత్రువు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మాదాపూర్ లో మొక్కలు నాటారు విలక్షణ నటుడు జయప్రకాష్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకరంగా ఉంటుందని నేను షుటింగ్ కోసం వివిధ ప్రదేశాల్లో తిరుగుతు ఉంటాను కేరళ తర్వాత అంత అద్భుతంగా ఆహ్లాదకరంగా హైదరాబాద్ నగరమే ఉన్నదని ఇక్కడ చాలా పచ్చదనం కనిపిస్తుందని తెలిపారు.

పచ్చదనాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి తజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా తమిళ్ హీరో అశోక్ సెల్వన్; నటుడు దర్శకుడు నిర్మాత అయిన శశి కుమార్; నటి తులసి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.