సీఎం జగన్ ప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి..

57
- Advertisement -

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు జిల్లా ఇంఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. విజయవాడ నగర అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక నిధులు మంజూరు చేశారని మంత్రి స్పష్టం చేశారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విజయవాడ నగర అభివృద్ధికి సీఎం జగన్ సహకరిస్తున్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో విజయవాడ నగర ప్రజాలను మోసం చేశారు. సెంట్రల్ నుండి వచ్చిన నిధులు చంద్రబాబు అమరావతికి తరలించారు. చంద్రబాబు అభివృద్ధి శిలాఫలకాలు కే పరిమితం అయ్యిందని విమర్శించారు.మా ప్రభుత్వం పాలనలో విజయవాడ మూడు నియోజకవర్గలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం. కృష్ణా నది రిటర్నింగ్ వాల్‌కు కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కి దక్కింది. విజయవాడ నగరాన్ని అభివృద్ధి విషయంలో మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని మంత్రి మండిపడ్డారు. సీఎం జగన్ రాకతో రాష్ట్రంలోని అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతోంది అన్నారు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.200 కోట్లలతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చంద్రబాబు శంకుస్థాపన చేసి వదిలేసిన అభివృద్ధి పనులు మేము ప్రారంభించాం.. చంద్రబాబు విజయవాడ నగర అభివృద్ధిని తుంగలో తొక్కారని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చెందింది. సెంట్రల్ నియోజకవర్గంలో రెండు కమిటీ హాల్స్, రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -