బోయిన్‌పల్లి మార్కెట్‌లో మంత్రి నిరంజన్‌ రెడ్డి..

570
minister niranjanreddy
- Advertisement -

హైదరాబాద్ బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాష్ట్రం నలుమూలల మార్కెట్లు ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఒకే దగ్గర మార్కెట్ ఉండడం మూలంగా పలు సమస్యలు వస్తున్నాయని నగరంలో డిమాండ్‌కు అనుగుణంగా నూతన మార్కెట్లు రావాలన్నారు.

నూతన మార్కెట్ల ఏర్పాటుతో ప్రజలతో పాటు రైతులకు ఇబ్బందులు తగ్గుతాయని చెప్పారు. 13 రాష్ట్రాలకు కూరగాయల అమ్మకానికి ప్రధాన మార్కెట్ బోయిన్ పల్లి అని తెలిపిన నిరంజన్ రెడ్డి .. నగరానికి రోజుకు దాదాపు నాలుగు వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు వస్తున్నాయని తెలిపారు.

ఒక్క బోయినపల్లి మార్కెట్ కే 1500 నుండి 2 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు వస్తున్నాయని …మార్కెట్ పక్కన ఉన్న ఎల్ఐసీ స్థలం లీజుకు లేదా ప్రత్యామ్నాయ స్థలం అప్పగించే ప్రతిపాదన మీద ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టాలన్నారు. రైతులు, వినియోగదారుల సౌలభ్యం దృష్ట్యా బోయిన్ పల్లి మార్కెట్ ను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

మార్కెటింగ్ శాఖ తరపున నిర్వహిస్తున్న మన కూరగాయలు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి దాని విస్తరణకు పలు సూచనలు చేశారు. మార్కెట్ లో వచ్చే చెత్త నుండి కరంటు తయారుచేసే బయో గ్యాస్ ప్లాంట్ పరిశీలన .. మరింత విస్తరించాలని అధికారులకు సూచించారు.

- Advertisement -