పథకాలు కేసీఆర్ ప్రభుత్వానివి..పన్నులు మోడీ ప్రభుత్వానివి అని మండిపడ్డారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతుబంధు నిధులు విడుదల సందర్భంగా మాట్లాడిన ఆయన..ఇవాళ రైతుబంధు నిధులు రూ.482.32 కోట్లు విడుదల చేశామన్నారు. 1,76,604 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ అయ్యాయని..9 లక్షల 64 వేల 658.38 ఎకరాలకు నిధులు విడుదల చేశామని వెల్లడించారు.
ఇప్పటి వరకు మొత్తం 60 లక్షల 85 వేల 57 మంది రైతుల ఖాతాలలో రూ.5801.06 కోట్లు జమ అయ్యాయని తెలిపారు. ప్రజల అవసరాలే తెలంగాణ ప్రభుత్వ పథకాలకు ప్రాతిపదిక అని…తెలంగాణ ప్రభుత్వ పథకాలలో కేంద్రం వాటా సున్నా అని విమర్శించారు. తెలంగాణ పథకాలకు, అభివృద్ధికి తోడ్పాటు అందివ్వకపోగా అడ్డుపడుతుండడం తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిదర్శనం అన్నారు.
రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్ పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నాం అని…కాంగ్రెస్, బీజేపీలకు రాద్దాంతం తప్ప, సిద్దాంతం, విలువలు లేవన్నారు. ఆ పార్టీలది తెలంగాణలో ఒడిసిన ముచ్చట అని ప్రజల ఆశీస్సులతో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.
ఇవి కూడా చదవండి..