కూరగాయల విస్తీర్ణం సాగు పెరగాలి:నిరంజన్ రెడ్డి

38
- Advertisement -

రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెరగాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ సచివాలయంలోని వ్యవసాయ శాఖ మంత్రి సమావేశపు హాలులో కూరగాయల సాగుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యాన శాఖ సంచాలకులు హన్మంతరావు , వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శి సత్య శారద , జాతీయ విత్తన సంస్థ ప్రాంతీయ అధికారి బ్రిట్టో తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి..నెలవారీగా రాష్ట్రంలో కూరగాయల వినియోగం, సాగు, ఉత్పత్తి, సాగు చేసే సన్న, చిన్నకారు రైతులపై మరోసారి అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. కూరగాయల సాగులో మారుతున్న అవసరాలపై దృష్టిసారించాలన్నారు. కూరగాయల విత్తనాల ధరలు, మార్కెట్ లో కూరగాయల ధరలు, కూరగాయల సాగుకు రైతులకు అవసరమైన సౌకర్యాలపై ఏం చర్యలు తీసుకోవాలన్నారు.కూరగాయల నిల్వకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి…దీర్ఘకాలిక ప్రయోజనాలు, స్వల్పకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు ప్రత్యేకంగా అధ్యయనం చేయాలన్నారు.

Also Read:Ram Charan: క్లీంకార అంద‌మైన వీడియో

హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు నూతన జిల్లా కేంద్రా పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగు పెంపొందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నారు.సాగు పెంపుకోసం అవసరమైన మౌళిక సదుపాయలపై సూచనలు చేయాలని…కూరగాయల సాగులో ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఆచరణాత్మక విధానాలను పరిశీలించాలన్నారు. వీటన్నింటిపై వివరణాత్మక నివేదిక, సూచనలు ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో కూరగాయల సాగుకు ఒక సమగ్ర ప్రణాళిక రూపొందిస్తాం అన్నారు.

Also Read:కాంగ్రెస్ వ్యూహకర్త.. గుడ్ బై?

- Advertisement -