కాంగ్రెస్ వ్యూహకర్త.. గుడ్ బై?

52
- Advertisement -

కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ? అంటే అవుననే సమాధానాలు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు సునీల్ వ్యూహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సీట్ల కేటాయింపులోనూ, బీజేపీని డిఫెన్స్ లో పడేయడంలోనూ సునీల్ స్ట్రాటజీ కాంగ్రెస్ కు మంచి ఫలితాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా సీట్ల కేటాయింపులో సినీల్ టిమ్ చేసిన సర్వేల ఆధారంగానే అధిష్టానం పంపకలు జరిపింది. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 155 స్థానాలను కైవసం చేసుకుందనే టాక్ ఉంది. అందుకే తెలంగాణలో కూడా సునీల్ కనుగోలునే వ్యూహకర్తగా నియమించుకుంది హస్తం పార్టీ.

Also Read:Ram Charan: క్లీంకార అంద‌మైన వీడియో

ఇప్పటికే సునీల్ అమలు చేస్తున్న వ్యూహలలో భాగంగానే హస్తం పార్టీ రాష్ట్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇక నియోజిక వర్గాల వారీగా ఇప్పటికే సర్వే రిపోర్ట్స్ చేతిలో ఉంచుకున్న సునీల్ కనుగోలు.. సీట్ల పంపకల విషయంలో కొందరు నేతలను పక్కన పెట్టాలని టి కాంగ్రెస్ కు సూచిస్తున్నారట. ఇక్కడే అసలు చిక్కు. సినీల్ కనుగోలు చేసిన సర్వేలలో రేవంత్ రెడ్డి సన్నిహితులకు కూడా వ్యతిరేక ఫలితలే వచ్చినట్లు టాక్. అయితే తాను సూచించిన వారికి సానుకూల రిపోర్ట్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలును కోరరాట. దానికి ససేమిరా అన్న సునీల్.. పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన హైదరబాద్ వీడి బెంగళూరు కు మకాం మర్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పార్టీకి సునీల్ కనుగోలు గుడ్ బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒకవేళ సునీల్ కాంగ్రెస్ విడితే పార్టీకి గట్టి దేబ్బే అని చెప్పాలి. మరి ఈ వార్తలపై పూర్తి స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో నిజామాబాద్ ఫారెస్ట్ సిబ్బంది..

- Advertisement -