భారీ వర్షాలు..రెండు రోజులు సెలవులు

33
- Advertisement -

రాష్ట్రంలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ,రేపు రెండు రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో అన్ని శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ సూచనతో రాష్ట్రంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు శుక్రవారం వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసేందుకు అనుమతులిచ్చాయి.

వర్షాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం కేసీఆర్. ఇక మంత్రి కేటీఆర్‌ సైతం మున్సిపాలిటీల్లో పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించారు. వ్యాధులు, పాము, తేలుకాటు వంటి సంఘటనలు నమోదయ్యే అవకాశం ఉండటంతో సబ్‌ సెంటర్‌ నుంచి సూపర్‌ స్పెషాలిటీ దవాఖానల వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాష్ట్ర సచివాలయంతోపాటు, కలెక్టరేట్‌, ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలమేరకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.

Also Read:కూరగాయల విస్తీర్ణం సాగు పెరగాలి:నిరంజన్ రెడ్డి

- Advertisement -