సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం…

143
niranjan
- Advertisement -

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్దిష్టమైన మానవ వనరుల ప్రణాళిక లేని అంశాలపై మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు , సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య ,టెస్కాబ్ ఎండీ మురళీధర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి…ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీ తీసుకొస్తామన్నారు. కమిటీ వెంటనే నివేదిక సమర్పించాలని…. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అన్నారు. 800 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో 2500 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఇప్పటి వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత గానీ, పదోన్నతుల వంటివి లేవన్నారు.

కరోనా విపత్కర పరిస్థితులలో ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా పనిచేస్తున్నారని…. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవ వేతనం మీద చర్చ జరిగిందన్నారు.

- Advertisement -