జూన్ చివరి వరకు లాక్‌డౌన్‌:రాష్ట్రాలకు కేంద్రం సూచన

52
lockdown india

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది కేంద్రం. జూన్ చివరి వరకు లాక్ డౌన్ పొడగించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు అన్నిరాష్ట్రాల సీఎస్‌లకు లేఖరాసింది కేంద్రం.

లాక్ డౌన్ పొడగించే అంశాన్ని పరిశీలించాలని తెలిపింది. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన లాక్ డౌన్ సత్ఫలితాలనిస్తున్నాయి. గత 24 గంటల్లో 1,86,364 పాజిటివ్ కేసులు నమోదుకాగా 3,660 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,75,55,457గా ఉండగా ఇప్పటి వరకు 2,48,93,410 మంది కోలుకున్నారు.

దేశంలో ప్రస్తుతం 23,43,152 యాక్టివ్ కేసులుండగా 3,18,895 మంది వైరస్‌ బారినపడి మృత్యువాతపడ్డారు. దేశంలో రికవరీ రేటు 90.34 శాతంగా ఉండగా పాజిటివిటీ రేటు 10.42శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 20.57 కోట్ల వ్యాక్సిన్‌ వేయగా మొత్తం 33.90 శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.