శ్రీశైలం ఘటన దురదృష్టకరం: నిరంజన్ రెడ్డి..

124
niranjan reddy

శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మృతిచెందిన వారికి అశృనివాళులు అర్పించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 9 మంది సిబ్బంది మరణించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రభుత్వ సహాయక చర్యలతో వారు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటకు వస్తారని ఆశించామని, దురదృష్టవశాత్తు వారు మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు