మృతుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం: జగదీశ్ రెడ్డి

154
Minister Jagadish Reddy
- Advertisement -

శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం లో జరిగిన అగ్నిప్రమాదం లో మృతి చెందిన జెన్కో ఉద్యోగుల పార్థివ దేహాలను ఆయన ఈ సాయంత్రం సందర్శించి నివాళులు అర్పించారు.అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ స్వయంగా తనతో పాటు రీస్క్యూ టీం లు ఉద్యోగుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించక పోవడం తనను కలచి వేస్తుందని ఆయన గద్గద స్వరం తో ఆవేదన వెలిబుచ్చారు.

ప్లాంట్ ను కాపాడే ప్రయత్నంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఉద్యుగుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన డీఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి 50 లక్షలు మిగితా వారికి ఒక్కొక్కరికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారన్నారు.శాకాపరమైన బెన్ఫిట్లు యదాతదంగా ఉంటాయన్నారు.

ఇప్పటికే జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీబీసీఐడి విచారణ కు అదేశించారన్నారు.తోటి ఉద్యోగులను కాపాడుకునేందుకు సహచర ఉద్యోగులతో పాటు పోలీస్,అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారని ఆయన చెప్పారు.ఒక్కసారి గా జరిగిన అగ్నిప్రమాదం తో పొగలు దట్టంగా వ్యాపించడం తో సొరంగ మార్గం గుండా లోపటికి పోవడం సాధ్యపడలేదు అన్నారు.ఇంకా ఈ విలేకరుల సమావేశంలో యం పి రాములు,స్థానిక శాసనసభ్యులు గువ్వల బాలరాజు కల్వకుర్తి జడ్ పి టి సి భరత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -