తెలంగాణ రాష్ట్రంలో అద్భుత, ప్రకృతి రమణీయమైన ప్రాంతాలు ఒక్కొటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పూర్తయిన వివిధ ఎకో టూరిజం ప్రాజెక్టులను మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అమ్రాబాద్‌తో పాటు అటవీ ప్రాంతాల్లో పర్యటించే, ప్రయాణించే ప్రతీ ఒక్కరూ బాద్యతాయుతంగా ఉండాలని మంత్రి కోరారు. అన్ని అడవులు ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించామని, వన్యప్రాణులకు హాని చేసే ప్లాస్టిక్ అడవుల నుంచి దూరంగా ఉంచాలని తెలిపారు.
రాష్ట్రంలో బాధ్యతా యుతమైన, పర్యావరణ హిత టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వుల సమీపంలో మరిన్ని ఎకో టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. టూరిస్ట్ ప్రాంతాల ప్రత్యేకతను కాపాడుతూనే, ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో మన్ననూరు వద్ద ఎకో టూరిజం రిసార్ట్, ఆరు కాటేజీలు, ఎనిమిది కొత్త సఫారీ వాహనాలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పర్యాటకుల సమక్షంలో మంత్రి ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..