స్టార్లకు అరుదైన గౌరవాలు

28
- Advertisement -

ఈ రోజు ముగ్గురు సినీ స్టార్స్ కు అరుదైన గౌరవాలు దక్కాయి. ముందుగా బాలీవుడ్ బిగ్ బి అమితా బచ్చన్ కు అరుదైన గౌరవం దక్కింది. సౌదీలో జరుగనున్న ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ను ప్రారంభించే అవకాశం అమితాబ్ కు వచ్చింది. ఈ మ్యాచ్ లో లెజెండ్స్ మెస్సి, రోనాల్డో, నెయిమర్ వంటి స్టార్స్ అందరూ పాల్గొంటున్నారు. దీనికి సంబందించిన వీడియోని అమితా బచ్చన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. 4 గంటల్లో 22 లక్షలకి పైగా ప్రజలు వీక్షించారు.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్డున్ కు కూడా అరుదైన గౌరవం లభించింది. పైగా ఎక్కడ నుంచో తెలుసా ?, ఏకంగా దుబాయ్ ప్రభుత్వం నుంచి. అందుకే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నాను. మొత్తానికి యూఏఈ గోల్డెన్ వీసాను అల్లు అర్జున్ అందుకున్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు పుష్ప రాజ్. ‘నాకు ఎన్నో అనుభూతులు పంచిన దుబాయికి థాంక్స్. త్వరలోనే మళ్లీ కలుద్దాం’ అంటూ పోస్ట్ చేశాడు. మీకు తెలుసా ?, టాలీవుడ్ నుంచి యూఏఈ గోల్డెన్ వీసాను అందుకున్న తొలి హీరో మన అల్లు అర్జునే.

అలాగే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు కూడా మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే, 40 అంతర్జాతీయ మ్యాగజీన్ల కవర్ పేజీలపై ఉన్న ఈ మాజీ వరల్డ్ బ్యూటీ తాజాగా మరో ఘనత సాధించింది. ప్రముఖ బ్రిటిష్ మ్యాగజీన్ ‘వోగ్ కవర్’ పేజీపై కొలువుదీరింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ యాక్ట్రెస్ గా ఆమె, గుర్తింపుతో పాటు గొప్ప గౌరవాన్ని పొందింది.

ఇవి కూడా చదవండి…

యంగ్ డైరెక్టర్స్ తో రజినీ ?

బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అభిమానులు

మనోజ్ మంచు.. ‘వాట్ ది ఫిష్’

- Advertisement -