సినారెకు ఏకలవ్య శిష్యున్ని: యార్లగడ్డ

214
- Advertisement -

సి నారాయణ రెడ్డికి తనమీద పుత్ర ప్రేమ ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన సినారె 88 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మాట్లాడిన ఆయన…సినారెకు తాను ఏకలవ్య శిష్యున్ని అన్నారు. ఢిల్లీలో రాజ్యసభ్యుడిగా సినారెతో ఐదేళ్లు ఉండడం నా అదృష్టం అన్నారు.

ఢిల్లీలో ఎవరు భోజనానికి పిలిచినా నన్ను తప్పక తీసుకెళ్లేవారు, నేను వస్తానని చెప్పేవారని తెలిపారు. విశాఖలో మూడు రోజులు సినారె గారి జన్మదిన వేడుకలు చేశాం…..వారిని పల్లకిలో ఊరెగిద్దామనుకుంటే ప్రమాదం జరిగి ఉండడంతో వారి పుస్తకాలను ఊరేగించాం అన్నారు. భారత ప్రధాని వాజ్ పేయి గారిని పార్లమెంట్ హాలులో నిలబెట్టి గజల్ వినిపించిన గొప్ప వ్యక్తి సినారె అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి , దేశపతి శ్రీనివాస్, మామిడి హరికృష్ణ , డాక్టర్ ఎంకె రాము , డాక్టర్ జుర్రు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -