శనగ విత్తనాలు అందుబాటులో ఉంచాలిఃమంత్రి

456
niranjan Reddy
- Advertisement -

రబీ పంట నిమిత్తం శనగ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హాకా భవన్ లో వ్యవసాయ, మార్క్‌ఫెడ్‌, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది పంట దిగుబడి బాగా వస్తుంది. రైతులకు సరైన మద్దతు ధర చెల్లించి పంటను కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి విత్తనాభివృద్ధి అధికారులకు కొన్ని సూచనలు చేశారు.

ఎరువులను రైతులు అవసరానికి మించి వినియోగించకుండా అధికారులు వారిని చైతన్యం చేయాలి. డిసెంబరు 15 నాటికి 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్ ఫెడ్ వద్ద బఫర్ స్టాక్ కింద నిల్వలు ఏర్పాటు చేయాలి. పంటమార్పిడి కింద నువ్వుల పంటను ప్రోత్సహిస్తూ సబ్సిడీపై రైతులకు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.

- Advertisement -