‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ ఫస్ట్‌ లుక్‌

286
AnukunnadhiOkkati AyyindhiOkkati

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ సుధాకర్‌రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘స్నేహితులందరూ కలిసి చేసిన చిత్రమిది. ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ ‘‘సుధాకర్‌రెడ్డికి చాలా చాలా థ్యాంక్స్‌. వీరి నాయుడు మాకు ఎంతో అండగా ఉన్నారు. వాళ్లబ్బాయి శ్రీనివాస్‌, మేం కలిసి ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి, ఈ సినిమా చేశాం. షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం’’ అని అన్నారు.