ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్‌రెడ్డి..

168
nirangan reddy

ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగాంగా పెద్దమందడి మండలం ముందరితండా ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అలాగే అంకూర్‌ గ్రామ శివారులో నిర్మాణమవుతున్న రైతువేదిక పనులను కలిసి పరిశీలించి.. గోపాలపేట మండలానికి చెందిన లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు మరింత మేలు జరిగేలా రైతు వేదికల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టిందని, దసరా పండుగ నాటికి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అన్నారు. రాష్ట్రంలోని రైతులను ఎల్లవేళలా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక రకాలైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. రైతును రాజును చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ మొట్టమొదట రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలను యుద్ధప్రాతిపదికన చేపట్టారని మంత్రి తెలిపారు.