నదుల పరిరక్షణకు కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఖైరతాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవన్ లో ప్రారంభమైన రెండు రోజుల పాటు నదుల పరిరక్షణ పై జాతీయ స్థాయి సదస్సు.లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి….నదులు ఉన్న చోటనే నాగరికత వెలిసింది. నదులకు, నాగరికతకు అవినాభావ సంబంధం ఉందన్నారు. నదులను ఎవరు పట్టించుకోవడం లేదు…వ్యర్ధాలతో నిండి పోతున్నాయన్నారు.
నదుల సంరక్షణ లేక కలుషితం అవుతున్నాయి….కేంద్ర ప్రభుత్వం నదుల పరిరక్షణ కోసం ఏమీ చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నదులను సజీవం చేసింది…అందుకు సాక్ష్యం గోదావరి నది అన్నారు. 200 కిలోమీటర్ల మేర కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నది నేడు సజీవంగా ఉందని…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నదులను కలుషితం కాకుండా చర్యలు చేపడుతుందన్నారు. అందుకు గ్రామాల్లో చెత్త సేకరణ చేపడుతోంది… ఒక్కో గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్ ను ప్రభుత్వం అందించిందన్నారు.
గ్రామాల్లో పచ్చదనం కోసం నర్సరీ లను పెంచుతున్నాం. దేశంలో ఎక్కడ కూడా గ్రామానికి ఒక నర్సరీ లేదు ..తెలంగాణలో ఉన్నట్లు దేశంలో ఎక్కడ కూడా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, వాటర్ ట్యాంక్ లు లేవు.వీటి ద్వారా పచ్చదనం ఒక్కటే పెరగడం కాదు నదులు కలుషితం కూడా కాకుండా కాపాడగలుగుతున్నాం అన్నారు. 8 సంవత్సరాల కాలంలో 3 శాతం పచ్చదనాన్ని పెంచినం అంటే తెలంగాణ ఎంత ముందుచూపుతో వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చన్నారు. పచ్చదనం, నీటి సరఫరా తో పాటు కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నీటిపారుదల ప్రాజెక్ట్ దీన్ని 3 సంవత్సరాల రికార్డ్ సమయంలో నిర్మాణం చేపట్టాం అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం చేయడంతో రాష్ట్రంలో వలసలు పూర్తిగా తగ్గాయని…నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మాణం తో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పండిస్తున్న పంటలు ఎక్కువ కావడంతో కేంద్రం కొనం అని చేతులు ఎత్తేసిందని…వలసలను పూర్తిగా అరికట్ట కలిగాం అన్నారు.

