సెబాస్టియన్‌ పిసి524…U/A

121
sebastian
- Advertisement -

టాలెంట్‌ ఉన్నోళ్లకు టాలీవుడ్‌ ఎప్పుడూ వెల్కమ్‌ చెబుతుంది. కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు – మాసు, యూత్ – ఫ్యామిలీ… అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ‘సెబాస్టియన్ పిసి 524’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘సెబాస్టియన్‌ పిసి524’. కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగులో మార్చి 4న సినిమా విడుదల కానుంది.

కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు ‘సెబాస్టియన్ పిసి524’లో ప్రధాన పాత్రలు పోషించారు.

- Advertisement -