త్యాగాల తెలంగాణకు బీజేపీ చేసిందేంటీ అని ప్రశ్నించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న సంతోషం, సంబరాలలో తెలంగాణ ప్రజలు ఉండగానే ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేశారని మండిపడ్డారు. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రకు కేటాయించారు…. ఒక్క రోజు నిర్ణయం తీసుకుని వారంలో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టును ఐదేండ్లు సాగదీశారని వెల్లడించారు.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కట్టి ప్రజల బతుకుదెరువును పెంచిన రాష్ట్రం తెలంగాణ…దేశంలో పంజాబ్ గత 70 ఏళ్లుగా అత్యంత ఎక్కువ వరి దిగుబడి చేసే రాష్ట్రంగా ఉందన్నారు. ఏడేళ్ల తెలంగాణ రాష్ట్రం హరిత విప్లవానికి కేంద్రమైన పంజాబ్ ను తలదన్ని వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో నంబర్ వన్ గా నిలిచిందన్నారు. పంజాబ్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్ సీ ఐ ద్వారా వంద శాతం ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష ఎందుకు ప్రదర్శిస్తుంది….ఇంత గొప్పగా పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఒక్కనాడయినా చేయూతనిచ్చారా ? అని ప్రశ్నించారు.
యూపీఏ ప్రభుత్వంలో మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేశారు… అభివృద్ధి చెందుతూ, దేశానికి చేయూతగా నిలుస్తున్న ఐదారు రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న నిధులను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రంలో చలనం లేదు.. తెలంగాణకు విభజనచట్టం ప్రకారం కేంద్రం ఏర్పాటు చేయాల్సిన గిరిజన విశ్వవిద్యాలయం, వరంగల్ లో రైల్వే కోచ్ ఏర్పాటు ఏమయ్యాయి ?… కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ పెంచాలని విభజనచట్టం చెబుతున్నా కేంద్రం దానిని పట్టించుకున్న పరిస్థితి లేదు… ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్రం ఏర్పడిన ఆరునెలలలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) పరిశీలిస్తుందని విభజనచట్టంలో కేంద్రం పేర్కొంది .. ఏడేళ్లయినా అడుగు ముందుకు పడలేదన్నారు. కేంద్రం నుండి నగరీకరణకు, పట్టణీకరణకు అవసరమైన ప్రోత్సాహం లేదు…తెలంగాణ సాధారణంగా ఏర్పడిన రాష్ట్రం కాదు,
సుధీర్ఘపోరాటం, అనేక బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం అన్నారు.
ఇంత గంభీరమైన పరిస్థితులలో ఏర్పడినప్పుడు రెండు రాష్ట్రాలను స్థిరపరచడం, వాటి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడం విజ్ఞతగల కేంద్రం భాద్యత కానీ కేంద్రం ఈ విషయంలో విజ్ఞత మరవడంతో పాటు భాద్యతను విస్మరించింది …తెలంగాణ ఉద్యమం నడిచిందే నదీజలాల కోసం , సాగునీటి హక్కుల కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 17 ఏళ్లుగా పనిచేస్తున్నా ఇంతవరకు పరిష్కారం లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లయినా తెలంగాణ నీటివాటా తేల్చలేదన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి లోక్ సభలో బిడ్డను కని తల్లి మరణించిందని తెలంగాణను అవమానించారు…షెడ్యూలు 9,10 లో ఉండాల్సిన అంశాలను తేల్చడానికి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలను పెద్దరికం చేసి కేంద్రం సామరస్యంతో దారి చూపాల్సింది పోయి మీరేమన్న తన్నుకచావండి అన్నట్లు చాట్ల తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్లు పెట్టిందన్నారు.
సమస్యలు పరిష్కరించడంలో కేంద్రానిది పూర్తిగా నిష్క్రియాపరత్వం తెలంగాణకు బీజేపీ ఎక్కడ ? ఏ విషయంలో న్యాయం చేసింది ?నోటికొచ్చిన వాగుడు కాదు దమ్ముంటే ఈ సమస్యల గురించి మాట్లాడండి చేతనైతే తెలంగాణ – ఆంధ్ర నీటి, ఇతర సమస్యలను 10, 20, 30 రోజుల గడువు పెట్టి పరిష్కరించండి..కృష్ణా నది నుండి అక్రమంగా నీళ్లు తీసుకెళుతున్న ఆంధ్రా జలదోపిడి మీద బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ఒక్కనాడైనా ఎందుకు మాట్లాడరు..3 టీఎంసీలను అక్రమంగా ఎత్తుకుపోయేందుకు నిర్మిస్తున్న సంగమేశ్వరం అక్రమ నిర్మాణంపై మాట్లాడని బీజేపీ నేతలకు తెలంగాణ పట్ల ప్రేమ ఎక్కడిది ? తెలంగాణ పట్ల స్ఫృహ ఎక్కడిది ? తెలంగాణ రోషం ఎక్కడిది ?ఓట్లు, సీట్లు అనే ధ్యాసతప్పితే తెలంగాణ పట్ల బీజేపీకి మమకారం లేదు .. బీజేపీ థర్డ్ క్లాస్, దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి తెలంగాణ పట్ల ప్రేమ మమకారం ఉన్నది టీఆర్ఎస్ కు మాత్రమే .. అందుకే 14 ఏండ్లు కొట్లాడి రాష్ట్రం సాధించినం .. ఇప్పటికీ రాష్ట్రం కోసం కొట్లాడుతనే ఉన్నం అన్నారు.