రఘునందన్‌పై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

31
- Advertisement -

బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. తన వ్యవసాయ భూమిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు లేవని మంత్రి అన్నారు.

రఘునందర్‌ రావు ఆరోపణలు తప్పని రుజువైతే ఆయన ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ కుటుంబానికి ఉన్న మొత్తం భూమి 90 ఎకరాలు మాత్రమేనని చెప్పారు. తన భూమిలో ఫౌల్ట్రీ, డెయిరీ షెడ్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. తనకున్న ఆస్తులు.. మంత్రి పదవి రాకముందు నుంచి ఉన్నవేనని స్పష్టం చేశారు. రఘునందన్‌ వస్తే ఆయన ముందే సర్వే జరిపిస్తామన్నారు. తాము కొన్న భూమి కంటే గుంట ఎక్కువ ఉన్నా ఏ చర్యకైనా సిద్ధమన్నారు.

Also Read:CM KCR:అకాల వర్షాలపై సీఎం సమీక్ష

తన ఆస్తులకు సంబంధించి రఘునందన్‌రావు చేసిన ఆరోపణలు నిరాధరమైనవన్నారు. అసలు ఆర్డీఎస్‌ కాలువ ఎక్కడుందో తెలుసా అని రఘునందన్‌ను ప్రశ్నించారు. ఆయన చూపిన పత్రాలు శుద్ధ అబద్ధాలని చెప్పారు.

Also Read:whatsapp:వాట్సాప్ స్టేటస్‌ నేరుగా ఫేస్‌బుక్‌లో

- Advertisement -