బీజేపీ…కార్పొరేట్లకు దాసోహం

58
minister-niranjan-reddy-
- Advertisement -

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో జరిగిన రైతు బందు వారోత్సవాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామం లో సీఎం కేసీఆర్,జై కేసీఆర్ చిత్రాలను ప్రత్యేకంగా విత్తనాలతో మొలకెత్తించి తీర్చిదిద్దిన ప్రాంతాన్ని మంత్రులు పరిశీలించారు.

అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విత్తనాలను మొలకెత్తించి వాటిలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించటం సాధారణమైన విషయం కాదు అని వాటికి రూపకల్పన చేసిన వారిని అభినందించారు.వారం రోజులుగా రైతు బంధు వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా పండుగల నిర్వహిస్తున్నామని,రైతులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి రైతు బందు సంబరాల్లో పాల్గొంటున్నారు అని అన్నారు.

ఇప్పటివరకు 8 విడతల్లో 50వేల600 కోట్ల రూపాయలను రైతు బంధు ద్వారా రైతులకు పెట్టుపడి సహాయం గా అందించాం అని తెలిపారు.ప్రతి ఏటా సగటున 60వేల కోట్ల రూపాయలను రాష్ట్రం లోని రైంతంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది అని దేశం లో మరే రాష్ట్రం లో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుంది అని అన్నారు.

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో రైతు వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తున్నారు అని ప్రజల చేతుల్లో ఉన్న ఆహార రంగాన్ని కార్పొరేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అని అన్నారు.అనంతరం కల్లూరు మండలం లో సొసైటీ ప్రారంభోత్సవ కార్యక్రమం లో మంత్రులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -