వరి సాగు వద్దనే పరిస్థితి రావడం బాధాకరం- మంత్రి నిరంజన్ రెడ్డి

63
- Advertisement -

రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా సంస్థలో తెలంగాణ జిల్లాల జిల్లా వ్యవసాయాధికారులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులను చైతన్యం చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. వరి సాగు నుండి రైతుల దృష్టి మళ్లించాలి. అధికారులు మనసుపెట్టి పనిచేస్తే రైతులను పంటలమార్పిడి వైపు మళ్లించడం అసాధ్యమేమీ కాదు అన్నారు. వరి మళ్లలో మినుములు, పెసర్లు వేయడం మూలంగా వానాకాలం సాగులో ఎరువుల వాడకం తగ్గించవచ్చని చెప్పాలి. కుసుమలు, ఆముదాల సాగును తిరిగి చేపట్టేలా చూడాలి.

ఆముదాలకు అంతర్జాతీయ డిమాండ్ ఉంది .. దేశంలో తగినంత ఉత్పత్తి లేదు.. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు సమన్వయంతో పనిచేయాలి. డీఎపీ తెలంగాణ భూములకు అక్కర్లేదు.. ఎరువులు, రసాయనాల వాడకం తగ్గించేలా రైతులను చైతన్యం చేసి తద్వారా పంట పెట్టుబడి తగ్గేలా చూడాలని మంత్రి సూచించారు. రైతువేదికలలో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి.. నాణ్యమైన ఫర్నీచర్ తీసుకోవాలి. రైతువేదికల స్థాయి, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుందామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పటి నుండి వ్యవసాయరంగంలో అనేక మార్పులపై సమీక్ష నడుస్తూనే ఉంది. యాసంగిలో వరి సాగు వద్దనే పరిస్థితి రావడం బాధాకరం .. దేశంలో ఆహారాధాన్యాలను సమతుల్యం చేయడంలో కేంద్రం విఫలమైంది. దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా అత్యధిక వరి ధాన్యం ఉత్పత్తి సాధించే రాష్ట్రం తెలంగాణ. పప్పుగింజలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. అది రైతుకు అర్ధమయ్యేలా చెప్పేందుకు రాష్ట్రస్థాయి బృందాలను తయారుచేయాలి. పంటలమార్పిడి, వైవిధ్యీకరణపై లఘుదీపిక, గోడపత్రిక, రైతువేదికల వ్యాసదీపిక విడుదల చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి.

- Advertisement -