ఓటీటీలోకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’..

90

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే హీరో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు అఖిల్.. అల్లు అరవింద్ సమర్సణలో ‘ గీతాఆర్ట్స్-2 ‘ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే భారీగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రీలిజ్ తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 19న ఆహా లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్నిఅందించాడు. అఖిల్ కెరీర్ లోనే మొదటి కమర్షియల్ హిట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నిలిచింది.