త్వరలో జగిత్యాల మామిడి మార్కెట్‌కు శ్రీకారం..

179
Minister niranjan reddy
- Advertisement -

జగిత్యాల మామిడి మార్కెట్‌కు త్వరలో శ్రీకారం చుట్టబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన పంటల కొనుగోళ్లు, మార్కెట్ల అభివృద్దిపై మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్షలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్దన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలో జగిత్యాల మామిడి మార్కెట్‌కు శ్రీకారం చేయనున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంజూరు చేసిన వాలంతరి సంస్థ 10 ఎకరాల స్థలంలో మార్కెట్ అభివృద్ధి చేస్తాము. అలాగే తాండూరు రైతుబజార్‌ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌గా మార్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి. సకల సౌకర్యాలతో కొల్లాపూర్ మామిడి మార్కెట్‌ ఏర్పాటు చేశాం.. త్వరలో రైతులు, వ్యాపారులు, అధికారులతో సమావేశమై ఈ సీజన్ నుండే కోనుగోళ్లకు చర్యలు చేపడుతామని మంత్రి తెలిపారు.

కాగా,యాసంగి పంటల కొనుగోలు కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మౌళిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి. రైతులు వారి వద్ద ఉన్న టార్పాలిన్ లను కొనుగోలు కేంద్రాలకు వెంట తెచ్చుకోవాలి. ఈ నెల 6న సూర్యాపేట జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సన్నాహాలు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

- Advertisement -