జానారెడ్డి కథ ఇక సమాప్తం: బాల్క సుమన్

179
MLA Balka Suman
- Advertisement -

బులెట్ లాంటి భగత్ ముందు జానారెడ్డి వెనకబడి పోయారని.. జానారెడ్డి కోటలు 2018 లోనే బద్దలు అయ్యాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎద్దేవ చేశారు. శుక్రవారం నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్ పెద్దవుర మండలంలోని గ్రామాల్లో ప్రచారంలో పాల్గొంటారు. గ్రామాలకు గ్రామాలు గులాబీ దళంలో చేరుతున్నారు. భగత్ విజయం ఎప్పుడో ఖాయం అయిందని తెలిపారు. సీఎం కేసీఆర్ యువ నాయకత్వన్నీ ప్రోత్సహిస్తున్నారు. నా లాంటి ఎంతో మందిని ఎమ్మెల్యేలను.ఎంపీలుగా చేశారు.

బులెట్ లాంటి భగత్ ముందు జానారెడ్డి వెనకబడి పోయారు. కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి. జానారెడ్డి కోటలు 2018 లోనే బద్దలు అయ్యాయి. ఇప్పుడు కూడా జానారెడ్డిని ప్రజలు ఇంటికి పంపిస్తారని బాల్క ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ప్రచారం సప్పగా సాగుతున్నది.జానారెడ్డి అసహనం ప్రదర్శిస్తూ ముందే ఓటమిని ఒప్పుకుంటున్నాడు.టీఆర్ఎస్‌ ప్రచారాన్ని, భగత్‌కు వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ వారి కళ్ళు బైర్లు కముతున్నాయన్నారు.

జానారెడ్డిలో నిరుత్సాహం కనబడుతుంది. జానారెడ్డి వల్ల సాగర్‌కు ఎం లాభం ఉండదు. అధికారంలో ఉన్నన్ని రోజులు జానారెడ్డికి ప్రజలు గుర్తుకు రాలేదు.ఇప్పుడు కొత్తగా నీతులు చెపుతున్నాడు. జానారెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలెవ్వరు నమ్మరు. అసత్యాలు మాట్లాడుతున్న జానారెడ్డికి ఓటర్లే సరైన సమాధానం చెపుతారని సుమన్‌ విమర్శించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్ జానారెడ్డిని తిరస్కరిస్తున్నారు. జానారెడ్డి కథ, కాంగ్రెస్ కథ ఇక సమాప్తం. ఇక భవిష్యత్తు టీఆర్‌ఎస్‌ మాత్రమే అని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వ్యాఖ్యనించారు.

- Advertisement -