సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్ర‌బెల్లి..

70
Minister Errabelli

వ‌రంగ‌ల్ అర్బ‌న్‌, రూర‌ల్ జిల్లాల స్థానంలో హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాల‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

గ‌త నెల 21న వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌ల విన‌తి మేర‌కు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు. ప్ర‌జ‌లకు సౌక‌ర్యార్ధం సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. దీని ద్వారా ప‌రిపాల‌న ప్ర‌జ‌ల‌కు మ‌రింత సౌక‌ర్యంగా ఉంటుంద‌ని అన్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం వెంట‌నే ఆదేశాలు జారీ చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.