నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పట్టణప్రగతి కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరైయ్యారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ , గువ్వల బాలరాజు, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి సాధ్యమౌతుందని..ఈ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగాలి అన్నారు.
మన శరీరాన్ని శుభ్రం చేసుకున్నట్లే మన పరిసరాలను బాగుచేసుకోవాలి. పరిసరాల పరిశుభ్రతతోనే దోమలను అరికట్టగలం..దోమలను అరికడితే సగం వ్యాధులు ప్రజలకు దూరమైనట్లే. పల్లె, పట్టణ ప్రగతితో గొప్ప సాంఘీక మార్పుకు నాంది పలుకుదాం. పట్టణాలలో ఖాళీ స్థలాలు మరుగుకు నిలయాలు అవుతున్నాయి. వాటిని గుర్తించి శుభ్రం చేసి ఫెన్సింగ్ వేయడం మంచి కార్యక్రమం.కల్వకుర్తిలో చేపట్టిన ఈ కార్యక్రమం ఇతర పట్టణాలకు స్ఫూర్థిదాయకం కావాలని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలతో నిరంతరం తెలంగాణ అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు పనిచేసి అభివృద్దికి పాటుపడాలి. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజలు మమేకం అయ్యేలా చైతన్యవంతం చేయాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.