పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి- కేటీఆర్

262
ktr specch

ఇవాళ ఖమ్మం జిల్లాలో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం కాల్వొడ్జులో మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 20 నిమిషాల పాటు కాల్వొడ్డులో కలియతిరిగి ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు మంత్రి కేటీఆర్. డ్రైనేజీ కాలువ పరిశీలించిన కేటీఆర్‌ మురికి, చెత్త పేరుకుని ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశ్యుద్య నిర్వహనపై సంబంధిత అధికారులను మందలించారు.

అనంతరం మంత్రి పూల,పండ్ల, కూరగాయల దుకాణ దారులతో మాటా మంతిలో పాల్గొని ప్రజలతో ముచ్చట్టించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలు, వ్యాపారస్థులకు సూచనలు ఇచ్చారు. వ్యర్ధాలను డ్రైనేజీలో కాకుండా మునిసిపాలిటీ చెత్త వాహనాలలో వేయాలని కేటీఆర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌,ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇంఛార్జ్‌ కలెక్టర్‌ ఎంవీరెడ్డి, సీపీ తప్సీర్‌ ఇక్బాల్‌ పాల్గొన్నారు.