- Advertisement -
తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మంత్రి నిరంజన్ రెడ్డి తల్లి సింగిరెడ్డి తారకమ్మ మృతి చెందారు. వృద్దాప్యం కారణంగా ఆమె ఇవాళ ఉదయం మరణించారు. వనపర్తిలోని స్వగృహంలో తారకమ్మ తుదిశ్వాస విడిచారు.
తారకమ్మ మృతి విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, పార్టీ నేతలు నిరంజన్‌రెడ్డి స్వగృహానికి చేరుకుంటున్నారు. తారకమ్మ అంత్యక్రియలు స్వగ్రామంలో ఇవాళ జరగనున్నాయి. తారకమ్మ మృతిపై పలువురు టీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని వెలిబుచ్చారు.
- Advertisement -