కందుకూరు రైతుల సమస్యను పరిశీలిస్తాం

191
niranjan Reddy

ఖమ్మం జిల్లా కందుకూరు రైతుల సమస్యను పరిశీలిస్తామని చెప్పారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కు ఆంధ్రాబ్యాంకు ద్వారా కట్టిన పంటల భీమా సొమ్ము చెల్లింపులో అన్యాయం జరిగిందని నేడు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మంత్రిని కలిశారు రైతులు. భీమా సొమ్ము చెల్లించినా క్లెయిములో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అన్యాయం జరిగిందని ఆరోపించారు.

మొత్తం 511 మంది రైతులకు అన్యాయం జరిగింది. గడువు లోపల 2015 కు గాను రూ.కోటి 7 లక్షల 85 వేల 697 ప్రీమియం అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు చెల్లించామంటున్నారు రైతులు. సొమ్ము క్లైయింలో కందుకూరుకు బదులుగా వేంసూరును బ్యాంకు అధికారులు చూపారంటున్నఅగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. మరోవైపు తాము కందుకూరునే చూపామంటున్నారు బ్యాంకు అధికారులు . సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.