గ్రామీణ జీవనం విస్తరిస్తేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది- మంత్రి

107
Niranjan Reddy
- Advertisement -

అగ్రోస్ సహకారంతో మేనేజ్ సంస్థ ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు 45 రోజులు శిక్షణ పొందిన 30 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల రుణం నాబార్డు, మేనేజ్ సంస్థలు, ఎస్‌బీఐ సహకారంతో 36 శాతం సబ్సిడీపై అందజేత అందజేశారు. దీనికి సంబంధించిన శిక్షణ దృవపత్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేసి, అభినందించారు. ఈ కార్యక్రమంలో అగ్రోస్ ఎండీ రాములు తదితరులు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి విజయం వెనుక కష్టం ఉంటుంది..ఏ రంగంలో అయినా కష్టపడితేనే గుర్తింపు లభిస్తుంది. వివిధ అవసరాల మీద మీ వద్దకు వచ్చే రైతులు, వినియోగదారులతో స్నేహ పూర్వకంగా మెలగాలి. గ్రామీణ ప్రాంతాలలో గతానికి, ఇప్పటికి ప్రజల అవసరాలు మారిపోయాయి.పట్టణీకరణతో నగర జీవితంలో ఒత్తిళ్లు పెరిగాయి.గ్రామీణ జీవనం విస్తరిస్తేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అన్నారు.

గ్రామాలలో ప్రజల అవసరాలను గుర్తించి వ్యాపారాలను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలి. అగ్రోస్ శిక్షణను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలి. నాణ్యమైన సేవలు, నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందిస్తామనే నమ్మకం కలిగించాలి. కొంచెం కొత్తగా ఆలోచిస్తే వ్యాపారంలో రాణించడం పెద్ద ఇబ్బంది కాదు అని మంత్రి సూచించారు.

- Advertisement -