దూసుకుపోతున్న ‘మహాసముద్రం’ ట్రైలర్..

34

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’ లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సమపాళ్లలో కలుపుకుని ఈ మూవీ కథను అజయ్ భూపతి తయారుచేసుకున్నాడు. శర్వానంద్ – సిద్ధార్థ్ కథానాయకులుగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు. కథానాయికలుగా అదితీ రావు – అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు.

ఈ సినిమా నుంచి గురువారం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. చాలా వేగంగా ఈ సినిమా 5 మిలియన్ ప్లస్ వ్యూస్‌ను రాబట్టింది. ప్రధానమైన పాత్రలను .. ఆ పాత్రల స్వభావాలను .. ఆ పాత్రలకి సంబంధించిన ఎమోషన్స్ ను ఈ ట్రైలర్ లో గొప్పగా ఆవిష్కరించారు. దాంతో ఈ ట్రైలర్ చాలా మందికి బాగా నచ్చేసింది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచాలనే దర్శకుడి ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు.

Maha Samudram Trailer | 4K | Sharwanand,Siddharth, Aditi Rao Hydari | Ajay Bhupathi | Anil Sunkara