- Advertisement -
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులతో పటిష్ట బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి పట్టణంలోని బాలుర జూనియర్ కాలేజిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కను వినియోగించుకున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుధం వంటిదని దానిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
- Advertisement -