మంత్రులు, పార్టీ సీనియర్లతో లోకేష్ భేటీ

8
- Advertisement -

ఏపీ మంత్రి నారా లోకేష్ మంత్రులు, పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. కడపలో మహానాడు నిర్వహణపై చర్చించనున్నారు. రేపు, ఎల్లుండి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన ఉండనుంది. గుత్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు లోకేష్.

రూ.22 వేల కోట్లతో అనంతపురం జిల్లాలో రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు ఎల్లుండి శంకుస్థాపన చేయనున్నారు. రేపు గుంతకల్, అనంతపురం అర్బన్ నేతలతో లోకేష్ భేటీ కానున్నారు. అలాగే ఎమ్మెల్యే సురేంద్ర కూతురు పెళ్లికి హాజరుకానున్నార.

అలాగే ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. AIIB బ్యాంకు ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపించాయి పలు విదేశీ బ్యాంకులు . KFW, AFD, ADB, NDB, AIIB, జైకా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు – విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయం తీసుకున్నాయి.

Also Read:బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందమా?:కేటీఆర్

- Advertisement -