బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందమా?:కేటీఆర్

11
- Advertisement -

ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు మాజీ మంత్రి కేటీఆర్. మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో ఏదైనా రహస్య ఒప్పందం ఉందా? చెప్పాలన్నారు.

ప్రతి రోజూ ప్రజల ఇళ్లు, జీవనాధారాలను ధ్వంసం చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటి? వరంగల్‌లో ఈ విధ్వంస చర్యలు ఎందుకు జరుగుతున్నాయి? చెప్పాలన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులు వస్తున్న మార్గాన్ని ‘అందంగా మార్చే’ ఉద్దేశంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రజలకు చెబుతున్నారు. ప్రజాపాలన అంటూ మీరు చెప్పుకోవడం ఎంత దుర్మార్గం! అన్నారు.

పాలసుల్లో విందులు, వినోదాలపై ప్రజల సొమ్ము రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేసిన తరువాత, ఇప్పుడు ఆ బహుళ ఖర్చును సమర్థించలేక బీద ప్రజల జీవితాలను మీ బుల్డోజర్లతో నేలకూల్చేస్తున్నారా?చెప్పాలన్నారు.

Also Read:TTD:అన్నమయ్య సామాజిక కవి

 

- Advertisement -